pathaan: ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ లో ‘పఠాన్’ ప్రమోషన్

Shah Rukh Khan Film Pathaan Promotions in FIFA World Cup Finals
  • ఖతార్ వేదికగా ప్రమోషన్ కార్యక్రమం
  • పాల్గొననున్న షారుఖ్, దీపికా పదుకుణే 
  • వచ్చే నెల 25న ప్రపంచవ్యాప్తంగా పఠాన్ విడుదల
ఖతార్ వేదికగా ఆదివారం రాత్రి జరగనున్న ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కు మరో ఈవెంట్ జత కలిసింది. ఈ వేదికపై తన కొత్త సినిమా పఠాన్ ను షారుఖ్ ఖాన్ ప్రమోట్ చేయనున్నారు. షారుఖ్ తో పాటు ఈ సినిమాలో నటించిన దీపికా పదుకుణే కూడా ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ లో సందడి చేయనున్నారు. బాలీవుడ్‌ బాద్ షా షారుఖ్‌ ఖాన్‌ సుదీర్ఘ విరామం తర్వాత నటించిన సినిమా కావడంతో అభిమానులలో అంచనాలు పెరిగిపోయాయి. పఠాన్‌ మూవీని యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దినట్లు డైరెక్టర్ సిద్దార్థ్‌ ఆనంద్‌ చెప్పారు. ఇంకా ఈ సినిమాలో జాన్ అబ్రహాం కీలక పాత్రలో కనిపించనున్నారు.

వచ్చే ఏడాది జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ఈ సినిమా సందడి చేయనుంది. దీంతో షారుఖ్, దీపికా సినిమా ప్రమోషన్ పై దృష్టిపెట్టారు. ఇందులో భాగంగానే ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరగనున్న ఖతార్ లో ప్రమోషన్ కార్యక్రమం చేయనున్నారు. ఇందుకోసం దీపికా పదుకుణే, షారుఖ్.. ఇద్దరూ ఖతార్ చేరుకున్నారు. ఈ ప్రమోషన్ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను షారుఖ్ ఇప్పటికే వెల్లడించారు. 

స్పెయిన్‌, యూఏఈ, టర్కీ, రష్యా, సైబీరియా, ఇటలీ, ఫ్రాన్స్, ఇండియా, అప్ఘనిస్థాన్‌లలో పఠాన్ సినిమా షూటింగ్ జరుపుకుందని మూవీ యూనిట్ వెల్లడించింది. సినిమా హిందీతో పాటు తెలుగు, తమిళం భాషలలో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. అయితే, ఈ సినిమాకు సంబంధించిన బేషరమ్ రంగ్ పాటను ఇప్పటికే విడుదల చేయగా.. పాటలో అశ్లీలత మోతాదు ఎక్కువైందని, దీపిక వేసుకున్న కాస్ట్యూమ్స్ మరీ కురచగా ఉన్నాయని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
pathaan
sharukh khan
Deepika Padukone
fifa world cup
pathaan pramotion

More Telugu News