Nikhil: బన్నీ చీఫ్ గెస్టుగా '18 పేజెస్' ప్రీ రిలీజ్ ఈవెంట్ .. వేదిక ఎక్కడంటే ..!

  • సుకుమార్ అందించిన కథతో రూపొందిన '18 పేజెస్'
  • బన్నీ వాసు నిర్మాతగా వ్యవహరించిన సినిమా ఇది 
  • ఈ నెల 19న హైదరాబాదులో జరగనున్న ప్రీ రిలీజ్ ఈవెంట్
  • ఈ నెల 23వ తేదీన రిలీజ్ అవుతున్న సినిమా
18 pages pre release event date confirmed

నిఖిల్ - అనుపమ జంటగా '18 పేజెస్' సినిమా రూపొందింది. సుకుమార్ కథను అందించిన ఈ సినిమాకి, పల్నాటి సూర్యప్రతాప్ దర్శకుడిగా వ్యవహరించాడు. బన్నీ వాసు నిర్మించిన ఈ సినిమాకి గోపీసుందర్ సంగీతాన్ని సమకూర్చాడు. ఇటీవలే ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు. 

ఈ నెల 23వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. కొంత సేపటి క్రితం వదిలిన ట్రైలర్ మంచి రెస్పాన్స్ ను రాబడుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ను కూడా ప్రకటించారు. ఈ నెల 19వ తేదీన బన్నీ ముఖ్య అతిథిగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. 

హైదరాబాదులోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ అందుకు వేదికగా మారనుంది. ఆ రోజున సాయంత్రం 6 గంటల నుంచి ఈ వేడుక ప్రారంభం కానుంది. బన్నీ రాకతో ఈ సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోవడం ఖాయమని భావిస్తున్నారు. ఈ ప్రేమకథా చిత్రం యూత్ కి ఏ స్థాయిలో కనెక్ట్ అవుతుందనేది చూడాలి.

More Telugu News