స్కూళ్లు, కాలేజీల్లో అమ్మాయిలపై అఘాయిత్యాలపై ప్రత్యేక చట్టం తెస్తున్న తెలంగాణ ప్రభుత్వం
- ఇటీవల హైదరాబాదు డీఏవీ స్కూలులో దారుణం
- చిన్నారిపై అత్యాచారం
- తీవ్రంగా పరిగణించిన తెలంగాణ సర్కారు
- విద్యాసంస్థల యాజమాన్యాలను బాధ్యులను చేసేలా కొత్త చట్టం
అమ్మాయిలపై ఏదైనా ఘటన జరిగితే సదరు స్కూలు, కాలేజీ యాజమాన్యాలను బాధ్యులను చేయడం ఈ చట్టంతో సాధ్యమవుతుందని వివరించారు. ఇప్పటికే స్కూళ్లు, కాలేజీల్లో చిన్నారులపై, యువతులపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ చట్టంతో మెరుగైన ఫలితాలు వస్తాయని భావిస్తున్నామని సీపీ పేర్కొన్నారు.
ఇక డ్రగ్స్ అంశంపైనా ఆయన స్పందించారు. గోవా డ్రగ్స్ కు కేరాఫ్ అడ్రస్ గా మారిందని, గోవాలో ఉండి హైదరాబాదులో డ్రగ్స్ అమ్ముతున్నవారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.