QR code: క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తున్నారా..? అది నిజమైనదేనా?

  • క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే డబ్బులు మీకు వస్తాయని చెబితే నమ్మొద్దు
  • చెల్లించే ముందు అవతలి వ్యక్తి వివరాలు నిర్ధారించుకోవాలి
  • క్యూఆర్ కోడ్ పై మరో కోడ్ స్టిక్కర్ అంటించి ఉంటే లావాదేవీ వద్దు
Beware of QR code scam or lose money how to identify and be safe from such scams

క్యూ ఆర్ కోడ్ ను స్కాన్ చేసి యూపీఐ చెల్లింపులను చేయడం నేటి జీవనంలో భాగంగా మారింది. జేబులో నోటు లేకపోయినా, చేతిలో ఫోన్ ఉంటే చాలు యూపీఐ ద్వారా సులభంగా చెల్లింపులు చేయవచ్చు. అయితే, ఇటీవలి కాలంలో ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ స్కామ్ లు కూడా కనిపిస్తున్నాయి. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన వారి బ్యాంకు ఖాతాలను సైబర్ నేరస్థులు ఖాళీ చేస్తున్నారు. 

స్కామ్ ఇలా..
ఓఎల్ఎక్స్ తదితర ప్లాట్ ఫామ్ ల వేదికలపై ఇలాంటి క్యూఆర్ కోడ్ స్కామ్ స్టర్స్ ను గుర్తించొచ్చు. ఈ స్కామ్ ఎలా జరుగుతుందంటే, మనం ఏదైనా ఉత్పత్తి విక్రయానికి పెట్టామనుకోండి. దాన్ని చెప్పిన ధరకే కొనుగోలు చేస్తానంటూ సైబర్ నేరస్థుడు సంప్రదిస్తాడు. వాట్సాప్ ద్వారా ఓ క్యూఆర్ కోడ్ పంపిస్తాడు. దాన్ని స్కాన్ చేయండి, అమౌంట్ మీ ఖాతాలో జమ అవుతుందని చెబుతాడు. ఆ మాటలు నమ్మి స్కాన్ చేస్తే, మన ఖాతాలో ఉన్న మొత్తాన్ని నేరగాళ్లు బదిలీ చేసుకుంటారు. 

మోసం బారిన పడకుండా ఉండాలంటే?

  • మన యూపీఐ ఐడీ, బ్యాంకు ఖాతా వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దు. ఎవరికైనా ఏదైనా ఉత్పత్తి విక్రయించాలని నిర్ణయించుకుంటే నగదు రూపంలోనే తీసుకోవాలి. డబ్బులు చెల్లింపులకే కానీ, డబ్బుల స్వీకరణకు యూపీఐ క్యూఆర్ కోడ్ స్కాన్ అవసరం ఉండదు.
  • ఒక క్యూఆర్ కోడ్ పై మరో క్యూఆర్ కోడ్ స్టిక్కర్ పేస్ట్ చేసి ఉన్నట్టు గమనిస్తే, చెల్లింపులు చేయకుండా ఉండడం మంచిది. 
  • డబ్బులు చెల్లింపులకు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసే వారు, స్కాన్ అయిన తర్వాత వచ్చే వ్యక్తి లేదా సంస్థ పేరు, తదితర వివరాలను నిర్ధారించుకోవాలి. 
  • ఓటీపీని ఎవరితోనూ పంచుకోవద్దు.

More Telugu News