Macherla: మాచర్లలో ఉద్రిక్తత... పరస్పర దాడులు.. టీడీపీ కార్యాలయానికి నిప్పు..?

Tensions raise in Macherla
  • మాచర్లలో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం
  • పరస్పరం ఎదురైన టీడీపీ, వైసీపీ శ్రేణులు
  • కర్రలు, రాళ్లతో దాడులు
  • జూలకంటి బ్రహ్మారెడ్డిని బలవంతంగా తరలించిన పోలీసులు
పల్నాడు జిల్లా మాచర్లలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. మాచర్ల టీడీపీ ఇన్చార్జి జూలకంటి బ్రహ్మారెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ తురకా కిశోర్ ప్రాతినిధ్యం వహిస్తున్న వార్డులో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం చేపట్టారు. అయితే టీడీపీ, వైసీపీ శ్రేణులు ఒకరికొకరు ఎదురుపడడంతో ఘర్షణలు చోటుచేసుకున్నాయి. రాళ్లు, కర్రలతో పరస్పరం దాడి చేసుకున్నారు. అయితే పోలీసులు రంగప్రవేశం చేసి జూలకంటి బ్రహ్మారెడ్డిని అక్కడ్నించి బలవంతంగా తరలించారు. 

బ్రహ్మారెడ్డిని అక్కడినుంచి తరలించిన తర్వాత పరిస్థితులు మరింత అదుపుతప్పాయి. కొందరు వ్యక్తులు టీడీపీ కార్యాలయానికి నిప్పు పెట్టినట్టు తెలిసింది. మాచర్ల టీడీపీ నేత దుర్గారావు కారును కూడా తగలబెట్టారు. 

ఈ దాడుల్లో పలువురికి గాయాలు కాగా, ఆసుపత్రికి తరలించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. దాడిచేసిన వారిపై కేసులు నమోదు చేయాలని టీడీపీ వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. పరిస్థితి అదుపుతప్పడంతో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాన్ని పోలీసులు నిలిపివేశారు.
Macherla
TDP
YSRCP
Police

More Telugu News