ఏపీని కేంద్రం మోసం చేసిందన్నది అవాస్తవం: పురందేశ్వరి
- కేంద్రం విభజన హామీలు నెరవేరుస్తుందన్న పురందేశ్వరి
- ఏపీకి అన్ని విధాలా సాయం చేస్తామని వెల్లడి
- ఏపీలో అన్ని శాఖలు అవినీతిమయం అని విమర్శలు
ఏపీలో అన్ని శాఖల్లోనూ అవినీతి పేరుకుపోయిందని పురందేశ్వరి విమర్శించారు. ఏపీలో మద్యం విక్రయాలపై డిజిటల్ పేమెంట్స్ ఎందుకు ఆమోదించడంలేదని ఆమె ప్రశ్నించారు. ఏలూరులో కార్పొరేషన్ శ్మశానాల్లో అంత్యక్రియలకు రూ.5 వేలు చొప్పున వసూలు చేయడం దారుణమని వ్యాఖ్యానించారు. ఏపీ ప్రభుత్వం దివాళా దిశగా పయనిస్తోందనడానికి ఇదే నిదర్శనం అని అన్నారు.