JEE Main: వచ్చేసిన జేఈఈ మెయిన్ షెడ్యూల్.. పరీక్షలు ఎప్పటి నుంచంటే?

  • జనవరి 24 నుంచి జేఈఈ మెయిన్ సెషన్-1 పరీక్షలు
  • ఏప్రిల్‌లో సెషన్-2 పరీక్షలు
  • నిన్నటి నుంచే ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ
  • 13 భాషల్లో సిద్ధమవుతున్న పరీక్ష పత్రాలు
JEE Main 2023 On January and April

దేశవ్యాప్తంగా లక్షలాదిమంది ఎదురుచూస్తున్న జేఈఈ మెయిన్ షెడ్యూల్ వచ్చేసింది. 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) జేఈఈ మెయిన్ షెడ్యూల్‌ను నిన్న విడుదల చేసింది. దీని ప్రకారం ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన జేఈఈ మెయిన్ సెషన్-1 పరీక్షలు జనవరి 24-31 మధ్య జరుగుతాయి. 26న రిపబ్లిక్ డే నాడు పరీక్ష ఉండదు. 

జేఈఈ మెయిన్ సెషన్-1 కోసం నిన్నటి నుంచే దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. వచ్చే నెల 12వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. 24వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయి. పరీక్షల కోసం ఇంగ్లిష్, హిందీ, తెలుగు, ఉర్దూ సహా మొత్తం 13 భారతీయ భాషల్లో ప్రశ్నపత్రాలు సిద్ధమవుతున్నాయి. కాగా, జేఈఈ మెయిన్ సెషన్-2 పరీక్షలు ఏప్రిల్‌లో నిర్వహించనున్నట్టు ఎన్‌టీఏ తెలిపింది. సెషన్-2 కోసం ఫిబ్రవరి 7 నుంచి మార్చి 7 మధ్య దరఖాస్తులు స్వీకరిస్తారు. 2021, 2022 సంవత్సరాల్లో 12వ తరగతి, లేదంటే అందుకు సమానమైన గుర్తింపు కలిగిన విద్యార్హత ఉన్నవారు పరీక్షలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

More Telugu News