Nara Lokesh: కన్నడ హీరో యశ్ ను కలిసిన నారా లోకేశ్

Lokesh met Kannada hero Yash
షార్ట్స్‌లో చూడండి
టీడీపీ ఎమ్మెల్సీ, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కన్నడ హీరో యశ్ ను కలవడం చర్చనీయాంశంగా మారింది. కేజీఎఫ్ స్టార్ యశ్ హైదరాబాద్ రాగా, ఓ హోటల్ లో ఆయనను లోకేశ్ కలిశారు. అయితే ఇరువురికి అంతకుముందు పరిచయం లేకపోవడంతో, లోకేశ్ చొరవ తీసుకుని తాను నారా చంద్రబాబునాయుడు కొడుకునని పరిచయం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఆపై, ఇరువురు కాసేపు ముచ్చటించుకున్నారు. 

ఈ సమావేశం సుమారు 30 నిమిషాల పాటు జరిగినట్టు తెలుస్తోంది. ఈ భేటీలో ఏం చర్చకు వచ్చిందన్నది మాత్రం తెలియరాలేదు. లోకేశ్, యశ్ మాట్లాడుకుంటున్నప్పటి ఫొటోలను ఐటీడీపీ ట్విట్టర్ లో పంచుకుంది.
Go Back to Shorts
Nara Lokesh
Yash
Hyderabad
TDP
Andhra Pradesh
Karnataka

More Telugu News