మడకశిర నియోజకవర్గంలో మంత్రి పెద్దిరెడ్డి పోస్టర్ల చింపివేత

  • మడకశిరలో రెండు వర్గాలుగా విడిపోయిన వైసీపీ
  • ఎమ్మెల్యే తిప్పేస్వామిని వ్యతిరేకిస్తున్న అసమ్మతి వర్గం
  • మంత్రికి విడివిడిగా స్వాగతం పలికిన రెండు వర్గాలు
శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలో వైసీపీ నేతల మధ్య ఆధిపత్య పోరు తార స్థాయికి చేరింది. రెండు వర్గాల మధ్య ఉన్న వర్గపోరు భగ్గుమంది. నియోజకవర్గ వైసీపీ విస్తృత స్థాయి సమావేశానికి రీజనల్ కోఆర్డినేటర్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హాజరుకానున్న నేపథ్యంలో విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. 

ఎమ్మెల్యే తిప్పేస్వామి వర్గం పెద్దిరెడ్డి ఫ్లెక్సీలను మడకశిరలో ఏర్పాటు చేసింది. పట్టణంలోని ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చింపేశారు. తిప్పేస్వామి వ్యతిరేకవర్గం ఈ పనికి పాల్పడిందని అంటున్నారు. కాసేపటి క్రితమే మడకశిరకు పెద్దిరెడ్డి చేరుకున్నారు. ఈ సందర్భంగా కూడా ఎమ్మెల్యే వర్గీయులు, వ్యతిరేక వర్గీయులు విడిపోయి మంత్రికి స్వాగతం పలికారు. రెండు వర్గాల నేతలు, కార్యకర్తలు మంత్రికి వేర్వేరు ప్రాంతాల్లో స్వాగతం పలకడం గమనార్హం.

Peddireddi Ramachandra Reddy
Makasira
Posters
YSRCP

More Telugu News