Pooja Hegde: పవన్ తదుపరి సినిమా నుంచి పూజా హెగ్డే తప్పుకుందా?

Pooja Hegde joins Mahesh Babu next opts out of Pawan Kalyan Ustad Bhagat Singh
  • అవునంటున్న తెలుగు చిత్రసీమ వర్గాలు
  • మహేశ్ బాబు ఎస్ఎస్ఎంబీ 28 సినిమాలో నటించనున్న పూజ
  • మహర్షి సినిమా తర్వాత మరోసారి జోడీ
పవన్ కల్యాణ్ సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా ప్రాజెక్టు నుంచి పూజా హెగ్డే విరమించుకుందా? దీనికి పరిశ్రమ వర్గాలు అవుననే అంటున్నాయి. మహేశ్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో రూపొందే ఎస్ఎస్ఎంబీ 28 సినిమాలో పూజ నటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.  

పవన్ కల్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను దర్శకుడు హరీశ్ శంకర్ తెరకెక్కించనున్నారు. పూజ తప్పుకుందన్న సమాచారంతో, పవన్ కల్యాణ్ జోడీగా ఎవరు నటిస్తారన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. మరోవైపు ఎస్ఎస్ఎంబీ 28 సినిమా చిత్రీకరణ విషయంలో ఎంతో జాప్యం నెలకొంది. దీనిపై దర్శకుడు త్రివిక్రమ్ కూడా అసహనంతో ఉన్నారనే సమాచారం వినిపిస్తోంది. ఈ జాప్యంతో పూజా హెగ్డే ప్రణాళికలు మారిపోయాయని, పవన్ కల్యాణ్ ప్రాజెక్టును వదులుకున్నట్టు తెలుస్తోంది. లోగడ మహర్షి సినిమాలో మహేశ్ సరసన పూజ నటించింది.
Pooja Hegde
joins
Mahesh Babu
ssmb28
Pawan Kalyan
Ustad Bhagat Singh

More Telugu News