Bandi Sanjay: నేటితో ముగుస్తున్న బండి సంజయ్ పాదయాత్ర.. ముగింపు సభకు జేపీ నడ్డా!

Bandi Sanjay padayatra ending today
  • 222 కిలోమీటర్ల మేర కొనసాగిన ఐదో విడత పాదయాత్ర
  • ఐదు జిల్లాల్లో కొనసాగిన యాత్ర
  • సాయంత్రం కరీంనగర్ లో భారీ బహిరంగ సభ
తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్ర నేటితో ముగియనుంది. కరీంనగర్ లో పాదయాత్ర ముగుస్తోంది. ఈ సందర్భంగా కరీంనగర్ లోని ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంలో బీజేపీ రాష్ట్ర నాయకత్వం భారీ సభను నిర్వహిస్తోంది. ఈ సభకు ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరుకానున్నారు. 

ఈ మధ్యాహ్నం 2.10 నిమిషాలకు నడ్డా హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి బయల్దేరి 3.30 గంటలకు కరీంనగర్ కు చేరుకుంటారు. 3.40 గంటలకు సభాస్థలికి చేరుకుంటారు. సభలో ప్రసంగించిన తర్వాత కరీంనగర్ నుంచి బయల్దేరి హైదరాబాద్ కు చేరుకుంటారు. సాయంత్రం 5.35 గంటలకు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి బయల్దేరుతారు. గత నెల 28న నిర్మల్ జిల్లా భైంసాలో బండి సంజయ్ పాదయాత్ర ప్రారంభమయింది. 18 రోజుల పాటు ఐదు జిల్లాల్లో 222 కిలోమీటర్ల మేర యాత్ర కొనసాగింది. నిర్మల్, ఖానాపూర్, వేములవాడ, జగిత్యాల, చొప్పదండి, ముథోల్, కరీంనగర్ నియోజకవర్గాల్లో యాత్ర కొనసాగింది.

Bandi Sanjay
JP Nadda
Padayatra
Karimnagar
Sabha

More Telugu News