Chandrababu: కేశినేని కుమార్తె వివాహానికి సతీసమేతంగా హాజరైన చంద్రబాబు... ఫొటోలు ఇవిగో!

Chandrababu and Bhuvaneswari attends Kesineni Nani daughter wedding
  • కేశినేని శ్వేత వెడ్స్ రఘు
  • హైదరాబాదులో వివాహం
  • వధూవరులను ఆశీర్వదించిన చంద్రబాబు, భువనేశ్వరి
టీడీపీ ఎంపీ కేశినేని నాని కుమార్తె శ్వేత, శాసనసభ మాజీ స్పీకర్ కాజ రామనాథం మనవడు రఘు వివాహం ఘనంగా జరిగింది. ఈ పరిణయ మహోత్సవానికి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సతీసమేతంగా హాజరయ్యారు. వధూవరులు శ్వేత, రఘులను చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు ఆశీర్వదించారు. నూతన జీవితంలోకి అడుగుపెడుతున్న వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. 

కేశినేని కుమార్తె పెళ్లికి టీడీపీ నేతలతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు కూడా హాజరయ్యారు. కేశినేని శ్వేత, రఘుల నిశ్చితార్థం గత జులై 31న జరిగింది. హైదరాబాదులోని హోటల్ తాజ్ కృష్ణలో నిశ్చితార్థం కూడా పెళ్లి స్థాయిలో ఘనంగా నిర్వహించారు.
Chandrababu
Nara Bhuvaneswari
Kesineni Nani
Swetha
Raghu
Wedding
TDP
Hyderabad

More Telugu News