పెంపుడు శునకం - ఇల్లాలు.. దాగుడు మూతల దండాకోర్!

Woman plays hide and seek with dog in adorable viral video Harsh Goenka loves it
  • తలుపు చాటున నక్కిన ఇంటి యజమాని
  • వెతుక్కుంటూ వచ్చిన కుక్కపిల్ల
  • ఎన్నో పర్యాయాలు అటూ ఇటూ పరుగెత్తిన తర్వాత గెలిచిన శునకం
దాడుడు మూతలు ఆడడం అంటే చిన్నారులు ఎంతో ఇష్టపడతారు. ఈ ఆట ఆడడం నాకు కూడా వచ్చని నిరూపించింది ఓ పెంపుడు శునకం. అచ్చం పిల్లలతో మాదిరే శునకాన్ని ఆటపట్టిద్దామనుకుంది ఇల్లాలు. వేగంగా గదిలోకి వచ్చి తలుపు చాటునకు వెళ్లి కనిపించకుండా నించుంది. మరో గదిలో నుంచి తన యజమాని కోసం ఆరాటంగా ఆ చిన్న కుక్క పిల్ల పరుగెత్తుకుంటూ బెడ్ రూమ్ లోకి వచ్చింది. అయినా గుర్తు పట్టలేకపోయింది. అలా ఒకటికి నాలుగు సార్లు ఆ గదిలో నుంచి ఈ గదిలోకి పరుగులు పెట్టింది.

చివరికి తలుపు చాటున ఉన్న ఇల్లాలిని ఆ పెంపుడు కుక్క పిల్ల గమనించి వేగంగా దగ్గరకు వెళ్లిపోయింది. మొత్తానికి ఆటలో తన యజమానిని ఓడించింది. పెంపుడు కుక్కలు కుటుంబ సభ్యులతో కలసిపోవడం, వారు చేసిన పనులను అనుకరించడం సాధారణమే. కాకపోతే ఈ ఇల్లాలు, శునకం ఆడిన దాగుడు మూతల ఆట వీడియో ఇప్పుడు ఆన్ లైన్ లో ఆకర్షణగా మారింది. అప్పటి వరకు పని ఒత్తిడిలో ఉన్నవారు చూస్తే కాస్తంత ఉపశమనంగా భావిస్తారు. ఈ వీడియోను ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష గోయంకా షేర్ చేశారు. ‘దాగుడు మూతల ఆట ఎంత అందమైనది’ అని క్యాప్షన్ పెట్టారు.
Go Back to Shorts
Woman
pet dog
play
hide and seek
game
vedio
viral
Harsh Goenka

More Telugu News