Roja: పవన్ వారాహి ఫొటోలు చూసి జనాలు నవ్వుకుంటున్నారు: రోజా

Roja satires on Pawan Kalyan and his Varahi
  • ఇటీవల వారాహి వాహనంతో పవన్ ఫొటోలు
  • యుద్ధానికి సిద్ధం అంటూ క్యాప్షన్
  • నారాహి ముసుగులో వారాహిలో వచ్చినా ఎవరూ భయపడరన్న రోజా
  • పవన్ రంగు పసుపేనని విమర్శలు
ఏపీ టూరిజం, క్రీడల శాఖ మంత్రి రోజా జనసేనాని పవన్ కల్యాణ్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. ట్విట్టర్ లో రెండు ఫొటోలు పోస్టు చేసిన పవన్ కల్యాణ్ ఇక యుద్ధానికి సిద్ధం అంటుంటే జనాలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. పవన్ కల్యాణ్ 'నారాహి' ముసుగులో 'వారాహి' వాహనంలో వచ్చినా ఎవరూ భయపడరని స్పష్టం చేశారు. 

పవన్ పక్క పార్టీల జెండాలు మోస్తాడని, ఆయన రంగు పసుపే అని రోజా వ్యాఖ్యానించారు. జనసేన ఒక అట్టర్ ఫ్లాప్ సినిమా అని విమర్శించారు. పవన్ వారాంతంలో వచ్చి రాజకీయాలు చేసే వీకెండ్ పొలిటీషియన్ అని అభివర్ణించారు.
Roja
Pawan Kalyan
Varahi
YSRCP
Janasena

More Telugu News