Jagan: మంత్రి విడదల రజనిని అభినందించిన సీఎం జగన్

CM Jagan appreciates health minister Vidadala Rajini
  • ఏపీ వైద్య ఆరోగ్యశాఖకు జాతీయ గుర్తింపు
  • టెలీ కన్సల్టేషన్, విలేజ్ హెల్త్ క్లినిక్ అంశాల్లో అవార్డులు
  • ఇటీవల అవార్డులు అందుకున్న రజని, ఎం.టి.కృష్ణబాబు
  • సీఎం జగన్ కు అవార్డులు చూపించిన రజని, కృష్ణబాబు
ఇటీవల ఏపీ వైద్యఆరోగ్య విభాగం జాతీయస్థాయిలో రెండు అవార్డులు కైవసం చేసుకుంది. టెలీ కన్సల్టేషన్ విభాగంలోనూ, విలేజ్ హెల్త్ క్లినిక్ ల అంశంలోనూ ఏపీకి ఈ అవార్డులు దక్కాయి. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని, సంబంధిత శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు కేంద్రమంత్రి డాక్టర్ మన్సుక్ మాండవీయ చేతుల మీదుగా ఈ అవార్డులు అందుకున్నారు. 

ఈ నేపథ్యంలో, మంత్రి విడదల రజని, ఎం.టి.కృష్ణబాబు నేడు తాడేపల్లిలో సీఎం జగన్ ను కలిశారు. ఏపీ వైద్య ఆరోగ్య శాఖకు లభించిన అవార్డులను ఆయనకు చూపించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మంత్రి రజని, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబులను, ఇతర వైద్య ఆరోగ్య శాఖ అధికారులను అభినందించారు. మున్ముందు కూడా ఇదే తరహా పనితీరు కనబర్చాలని సూచించారు.
Jagan
Vidadala Rajini
Awards
Health Dept
YSRCP
Andhra Pradesh

More Telugu News