Wagon R: ఇథనాల్ తోనూ నడిచే వ్యాగన్ ఆర్

  • ఇంజన్, ఉపకరణాల్లో మార్పులు
  • ఇథనాల్ కు అనుకూలంగా తయారీ
  • ప్రస్తుతం పెట్రోల్ 10 శాతం ఇథనాల్
  • 2025 నాటికి 20 శాతానికి పెరుగుదల
Maruti Suzuki showcases prototype Wagon R flex fuel car

మారుతి సుజుకీ ఫ్లెక్స్ ఫ్యూయల్ ఆధారిత వ్యాగన్ ఆర్ ను వినియోగదారులకు పరిచయం చేసింది. ప్రస్తుత వ్యాగన్ ఆర్ ఇంజన్ ను అప్ గ్రేడ్ చేసింది. పెట్రోల్ లో ఇథనాల్ మిశ్రమం ప్రస్తుతం 10 శాతానికి చేరింది. 2025 నాటికి ఇథనాల్ మిశ్రమం 20 శాతానికి చేరనుంది. తద్వారా దిగుమతుల భారం తగ్గించుకోవాలన్నది కేంద్ర సర్కారు ప్రయత్నం. ఈ పరిణామాల నేపథ్యంలో ఇథనాల్ ఆధారిత ఇంధన వినియోగానికి అనుకూలంగా వ్యాగన్ ఆర్ ను మారుతి సుజుకీ సిద్ధం చేసింది. ఇథనాల్ సెన్సార్ ను కుడా ఏర్పాటు చేసింది. అంటే పెట్రోల్ లో ఎంత ఇథనాల్ ఉందో ఈ సెన్సార్ గ్రహిస్తుంది. 

ఇథనాల్ కలిపిన ఇంథనం వినియోగించడం వల్ల ఇంజన్ పై ప్రభావం పడకుండా మన్నికగా ఉండేందుకు, ఫ్యూయల్ పంప్, ఫ్యూయల్ ఇంజెక్టర్, ఇతర ఉపకరణాలను కూడా ఇందులో మార్చింది. వ్యాగన్ ఆర్ ఫ్లెక్స్ ఫ్యూయల్ ప్రొటోటైప్ ఈ85 ఇంధనంతో పనిచేస్తుందని, తద్వారా సీహెచ్ జీ ఉద్గారాల విడుదలను 79 శాతం తగ్గిస్తుందని మారుతి సుజుకీ ఇండియా ఎండీ, సీఈవో హిసాషి టకెచి తెలిపారు.

More Telugu News