డియర్ ఫ్రెండ్ రజనీకాంత్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు: చంద్రబాబు
- నేడు రజనీకాంత్ పుట్టినరోజు
- 72వ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్న రజనీ
- ట్విట్టర్ లో స్పందించిన చంద్రబాబు
- దీర్ఘాయుష్షు కలగాలని విషెస్
డియర్ ఫ్రెండ్, సూపర్ స్టార్ రజనీకాంత్ కు హార్దిక జన్మదిన శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు. రజనీకాంత్ ప్రాభవం ఇలాగే కొనసాగాలని, ఆయనకు ఆయురారోగ్యాలతో కూడిన దీర్ఘాయుష్షు కలగాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. ఈ మేరకు తాను గతంలో రజనీకాంత్ ను కలిసినప్పటి చిత్రాన్ని పంచుకున్నారు.