ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ తో కవిత భేటీ

టీఆర్ఎస్ ఎమెల్సీ కవిత ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ ను కలిశారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో తన నివాసంలో ఆమె ఇవాళ సీబీఐ విచారణను ఎదుర్కొన్నారు. ఏడున్నర గంటల పాటు జరిగిన సుదీర్ఘ విచారణ ఈ సాయంత్రం 6.30 గంటలకు ముగిసింది. అనంతరం కవిత ప్రగతి భవన్ కు వెళ్లి సీఎం కేసీఆర్ తో సమావేశమయ్యారు. సీబీఐ విచారణ తీరుతెన్నులను తండ్రితో చర్చించారు. 

కాగా, ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితను బంజారాహిల్స్ లోని ఆమె నివాసంలో విచారించిన అనంతరం సీబీఐ స్పందిస్తూ, ప్రస్తుతానికి కవిత విచారణ ముగిసినట్టేనని వెల్లడించింది. ఇప్పటికే అవసరమైన సమాచారాన్ని సేకరించామని, అవసరమైతే మళ్లీ విచారణకు పిలుస్తామని తెలిపింది.


More Telugu News