Air India: ఎయిరిండియా విమానంలో పాము.. ఎలా వచ్చిందో తెలుసుకునేందుకు దర్యాప్తు!

Snake found on Air India Express flight after landing at Dubai
  • కోల్‌కతా నుంచి కేరళ మీదుగా దుబాయ్ చేరిన విమానం
  • కార్గో క్యాబిన్ చెక్ చేస్తుండగా కనిపించిన పాము
  • బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్న ఎయిరిండియా
ఎయిరిండియా విమానంలో పాము కలకలం రేపింది. కోల్‌కతా నుంచి బయలుదేరిన బి 737-800 విమానం కేరళ మీదుగా దుబాయ్ చేరుకుంది. ప్రయాణికులందరూ దిగిపోయిన తర్వాత విమాన సిబ్బంది కార్గో క్యాబిన్‌ను చెక్ చేస్తున్న సమయంలో అందులో పాము కనిపించింది. దీంతో వారు హడలిపోయారు. వెంటనే అత్యవసర సిబ్బందికి సమాచారం అందించారు. వారొచ్చి పామును పట్టుకుని బయటకు తీసుకెళ్లారు.

ఈ విషయాన్ని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) నిర్ధారించింది. మరోవైపు, క్యాబిన్‌లోకి పాము ఎలా వచ్చిందన్న దానిపై దర్యాప్తు చేస్తున్నట్టు ఎయిరిండియా తెలిపింది. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పేర్కొంది.
Air India
Dubai Airport
Snake

More Telugu News