తిరుమల కొండపై ఎడతెరిపి లేని వర్షం... శ్రీవారి మెట్టు మార్గంపై భారీగా వరద నీరు
- మాండూస్ తుపానుతో దక్షిణ కోస్తాలో విస్తారంగా వర్షాలు
- తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు
- తిరుమల కొండపై జోరు వానలు
- చెట్టు కూలి భక్తురాలికి గాయాలు
- అప్రమత్తమైన టీటీడీ
కాగా, తిరుమలలో ఓ భారీ వృక్షం కూలిపోయి భక్తురాలికి గాయాలయ్యాయి. అటు శ్రీవారి మెట్టు మార్గంలో భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. భారీ వర్షాల నేపథ్యంలో, టీటీడీ అప్రమత్తం అయింది.
కొండచరియలు విరిగిపడే ప్రాంతాల్లో భక్తుల రాకపోకలు నిలిపివేసింది. శ్రీవారి మెట్టు మార్గంపై నడిచి వెళ్లే భక్తులను అనుమతించడంలేదు. పాపనాశనం, శిలాతోరణం మార్గాలను మూసివేసింది. తిరుమలలోని అన్ని జలాశయాల్లో నీటిమట్టం గరిష్ఠ స్థాయికి చేరింది.