OnePlus: వన్ ప్లస్ నుంచి తక్కువ ధరకే 4కే ఆండ్రాయిడ్ టీవీ

OnePlus launched a new 55 inch 4K Android TV in India priced at Rs 39999
  • ధర రూ.39,999
  • తక్కువ బెజెల్స్ తో 55 అంగుళాల యూహెచ్ డీ డిస్ ప్లే
  • 13వ తేదీ నుంచి విక్రయాలు ప్రారంభం
వన్ ప్లస్ కంపెనీ ఆకర్షణీయమైన ఫీచర్లతో 4కే ఆండ్రాయిడ్ టీవీని తక్కువ ధరకే అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ టీవీ సైజు 55 అంగుళాలు. దీని ధర రూ.39,999. వన్ ప్లస్, అమెజాన్, ఫ్లిప్ కార్ట్ పోర్టళ్లపై దీని అమ్మకాలు ఈ నెల 13న మధ్యాహ్నం 12 గంటలకు మొదలవుతాయని వన్ ప్లస్ ప్రకటించింది. అలాగే, దేశవ్యాప్తంగా ఉన్న వన్ ప్లస్ ఎక్స్ పీరియన్స్ కేంద్రాల్లోనూ అందుబాటులో ఉంటుందని తెలిపింది. 

వన్ ప్లస్ టీవీ 55 వై1ఎస్ ప్రో పేరుతో వచ్చిన ఈ కొత్త టీవీ తక్కువ బెజెల్స్ తో ఫుల్ స్క్రీన్ తో ఉంటుంది. 4కే యూహెచ్ డీ డిస్ ప్లే 10 బిట్ కలర్ డెప్త్ తో ఉంటుంది. ప్రతి ఫ్రేమ్ లోనూ కలర్స్ అద్భుతంగా కనిపిస్తాయని వన్ ప్లస్ అంటోంది. హెచ్ డీఆర్ 10ప్లస్, హెచ్ డీఆర్ 10, హెచ్ ఎల్ జీ ఫార్మాట్ వల్ల మెరుగైన వీక్షణ అనుభవం లభిస్తుందని పేర్కొంది. 24 వాట్ ఫుల్ రేంజ్ స్పీకర్లు, డాల్బీ ఆడియో సపోర్ట్, ఆక్సిజన్ ప్లే 2.0 ఇందులో ఉంటాయి. 

OnePlus
new 4k tv
launched
attractive features

More Telugu News