ఉక్రెయిన్ పై సైనిక చర్య ఇప్పట్లో ముగియదు: పుతిన్
- రష్యా మానవ హక్కుల మండలి సమావేశంలో మాట్లాడిన పుతిన్
- ఎవరిపైనా మొదటగా అణుబాంబు వేయబోమని వెల్లడి
- ఎవరైనా అణుదాడి చేస్తే ప్రతిగా అణుదాడి చేస్తామని స్పష్టీకరణ
తాము ఎట్టి పరిస్థితుల్లోనూ మొదటగా అణ్వాయుధాలను వాడబోమని, ఒకవేళ తమపై ఎవరైనా అణుదాడికి పాల్పడితే కచ్చితంగా అణ్వస్త్రం ప్రయోగిస్తామని చెప్పారు. అణుదాడి పేరిట తాము ఎవరినీ బెదిరించడంలేదని, అణ్వస్త్రాల పట్ల తమకు అవగాహన ఉందని తెలిపారు. తమ వద్ద అత్యాధునిక అణ్వాయుధాలు ఉన్నాయని, అయితే తమ అణ్వాయుధాలేవీ విదేశాల్లో లేవని పుతిన్ స్పష్టం చేశారు. అమెరికా మాత్రం తన అణ్వాయుధాలను టర్కీలో ఉంచిందని ఆరోపించారు.
కాగా, పుతిన్ వ్యాఖ్యలను అమెరికా ఖండించింది. అణ్వాయుధాలపై రష్యా ఇష్టానుసారం మాట్లాడుతోందని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నెడ్ ప్రైస్ పేర్కొన్నారు. రష్యా వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యంతో కూడుకున్నవని విమర్శించారు.