హిమాచల్ సీఎం జైరామ్ ఠాకూర్ విజయం.. మెజారిటీ స్థానాలలో కాంగ్రెస్ ఆధిక్యం
- 22 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలిచిన ఠాకూర్
- సెరాజ్ నియోజకవర్గం నుంచి వరుసగా ఆరోసారి గెలుపొందిన నేత
- 38 చోట్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఆధిక్యం
అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన ఆధిక్యత దక్కేలా కనిపిస్తోంది. ఉదయం నుంచి నువ్వా నేనా అన్నట్లు రెండు పార్టీల ఫలితాలు వెలువడగా.. మధ్యాహ్నానికి ట్రెండ్ మారింది. కాంగ్రెస్ క్రమంగా పుంజుకుంది. మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో కాంగ్రెస్ 12 చోట్ల, బీజేపీ 13 స్థానాల్లో గెలుపొందగా.. మరో 13 చోట్ల బీజేపీ, 27 చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. దీంతో హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటు ఖాయమైనట్లేనని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.