Chiranjeevi: 'వాల్తేరు వీరయ్య' రిలీజ్ డేట్ ఖరారు!

waltair Veerayya Release Date Confirmed
షార్ట్స్‌లో చూడండి
చిరంజీవి కథానాయకుడిగా మైత్రీ మూవీ మేకర్స్ వారు 'వాల్తేరు వీరయ్య' సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి బాబీ దర్శకత్వం వహిస్తున్నాడు. చాలా గ్యాప్ తరువాత చిరంజీవి నుంచి వస్తున్న పక్కా మాస్ యాక్షన్ మూవీ ఇది. ఈ సినిమా నుంచి ఆయన లుక్ బయటకి వచ్చిన దగ్గర నుంచి అందరిలో ఆసక్తి పెరుగుతూ పోతోంది. 
 
ఈ సినిమా రిలీజ్ డేట్ కోసం అభిమానులంతా ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో విడుదల తేదీని కొంతసేపటి క్రితం ప్రకటించారు. సంక్రాంతి పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని, జనవరి 13 తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నట్టు చెబుతూ, అందుకు సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేశారు.

చిరంజీవి సరసన నాయికగా శ్రుతి హాసన్ అలరించనుండగా, ఇతర ముఖ్యమైన పాత్రలలో రాజేంద్రప్రసాద్ .. బాబీ సింహా .. వెన్నెల కిశోర్ .. కేథరిన్ కనిపించనున్నారు. ఇక దేవిశ్రీ స్వరపరిచిన మాస్ మసాలా ఐటమ్ లో ఊర్వశి రౌతేలా సందడి చేయనుంది.
Go Back to Shorts
Chiranjeevi
Sruthi Haasan
Catherine
Waltair Veerayya Movie

More Telugu News