Krishna: 'మోసగాళ్లకు మోసగాడు' విషయంలో ఎన్టీఆర్ అన్నట్టుగానే జరిగింది: ఆదిశేషగిరిరావు

Adiseshagiri Rao Interview
  • కృష్ణకి అండగా ఉంటూ వచ్చిన ఆదిశేషగిరిరావు 
  • అన్నతో గల అనుబంధాన్ని గుర్తుచేసుకున్న సోదరుడు 
  • అలా 'పద్మాలయ' నిర్మాణం జరిగిందని వ్యాఖ్య
  • 'అగ్ని పరీక్ష' ఫ్లాప్ గురించిన ప్రస్తావన
హీరోగా కృష్ణ ఎలాంటి టెన్షన్స్ లేకుండా ముందుకు వెళ్లడంలో ఆయన తమ్ముడు ఆదిశేషగిరిరావు హస్తం ఉంది. కృష్ణ సినిమాలకి సంబంధించిన అన్ని వ్యవహారాలను దగ్గరుండి ఆయన చూసుకునేవారు. తాజాగా 'ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే' కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, కృష్ణకి సంబంధించిన అనేక విషయాలను పంచుకున్నారు. 

"కృష్ణ హీరో అయ్యే సమయానికి నేను డిగ్రీ చదువుతూ ఉండేవాడిని. హీరోగా కృష్ణ బిజీ అయిన తరువాత ఆయనతో పాటు ఉండిపోయాను. ఎన్టీఆర్ గారు సొంత బ్యానర్ ను ఏర్పాటు చేయడంతో, కృష్ణ కూడా సొంత బ్యానర్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాడు. మొదటి సినిమాగా 'అగ్నిపరీక్ష' చేస్తే ఫ్లాప్ అయింది. ఆర్థికపరమైన నష్టాలను తెచ్చిపెట్టింది" అన్నారు. 

"ఆ తరువాత 'మోసగాళ్లకు మోసగాడు' సినిమాను నిర్మించాము. ముందుగా ఎన్టీఆర్ గారికి ఈ సినిమాను చూపించాము. 'సినిమా బాగానే ఉందిగానీ .. లేడీస్ రావడం డౌటే' అని ఆయన అన్నారు. నిజంగానే ఆయన అన్నట్టుగానే జరిగింది. లేడీస్ రాకపోవడం వలన, 4 వారాల తరువాత ఆ సినిమా ఊపుతగ్గింది. లేడీస్ కి సంబంధించిన ఎమోషన్స్ ఒక సినిమాకి ఎంతవరకూ అవసరమనేది అర్థమైంది. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ తరువాత చేసిన 'పండంటి కాపురం' సూపర్ హిట్ అయింది" అంటూ చెప్పుకొచ్చారు.
Krishna
AdiseshagiriRao
Open Heart With RK

More Telugu News