Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నేడు జగన్, చంద్రబాబు ఢిల్లీకి పయనం

Jagan and Chandrababu going to Delhi
Advertisement
  • జీ20 సదస్సు నిర్వహణపై ప్రధాని అధ్యక్షతన సమావేశం
  • సమావేశానికి హాజరవుతున్న జగన్, చంద్రబాబు
  • సాయంత్రం రాష్ట్రపతి భవన్ లో సమావేశం
Advertisement
ఏపీ ముఖ్యమంత్రి జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు నేడు హస్తినకు వెళ్తున్నారు. తదుపరి జీ20 సదస్సు నిర్వహణ బాధ్యతలు భారత్ కు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జీ20 సదస్సు నిర్వహణపై ప్రధాని మోదీ నేతృత్వంలో సమావేశం జరగనుంది. ఈరోజు సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు రాష్ట్రపతి భవన్ లో ఈ సమావేశం జరగబోతోంది.

ఈ సమావేశంలో పాల్గొనే నిమిత్తం జగన్ ఈ మధ్యాహ్నం 12.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి మధ్యాహ్నం 3.15 గంటలకు ఢిల్లీకి చేరుకుంటారు. మరోపక్క, చంద్రబాబు కాసేపటి క్రితం శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయల్దేరారు. సమావేశం ముగిసిన వెంటనే జగన్ ఢిల్లీ నుంచి తాడేపల్లికి తిరుగుపయనమవుతారు. 

జగన్ రేపు కడప జిల్లాలో పర్యటించనున్నారు. కడప అమీన్ పీర్ దర్గాలో పెద్ద ఉర్సు ఉత్సవాల్లో ఆయన పాల్గొంటారు. అలాగే ఏపీఎస్ఆర్టీసీ ఛైర్మన్ దుగ్గాయపల్లి మల్లికార్జునరెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్ కు హాజరవుతారు.
Advertisement
Advertisement
Jagan
YSRCP
Chandrababu
Telugudesam
Narendra Modi
BJP
G20

More Telugu News