DME: వైద్య విద్యార్థులకు డ్రెస్ కోడ్ వార్తలు అవాస్తవం.. నమ్మొద్దు: ఏపీ డీఎంఈ

  • వైద్య విద్యార్థులు జీన్స్, టీ షర్టులు ధరించకూడదని ఆదేశించినట్టు వార్తలు
  • అలాంటిదేమీ లేదన్న డీఎంఈ
  • యాప్రాన్, ఐడీకార్డు ధరించి రావాలన్న దానిపై త్వరలోనే మార్గదర్శకాలు విడుదల చేస్తామన్న డీఎంఈ
There Is No Dress Code For Medical Students Says AP DME

ఏపీలోని వైద్య విద్యార్థులు ఇకపై జీన్స్ ప్యాంట్లు, టీషర్టులు ధరించకూడదని.. సంప్రదాయ దుస్తులు ధరించి రావాలంటూ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) ఆదేశించినట్టుగా వచ్చిన వార్తలు వైరల్ అయ్యాయి. అమ్మాయిలు చీర, చుడీదార్‌తో రావాలని, జుట్టును వదులుగా వదిలేయొద్దని, పురుషులైతే క్లీన్ షేవ్‌తో రావాలంటూ డీఎంఈ ఆదేశించినట్టు వార్తలు హల్‌చల్ చేశాయి. 

తీవ్ర చర్చనీయాంశమైన ఈ వార్తలపై డీఎంఈ స్పందించింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వార్తలను నమ్మొద్దని, ఈ విషయంలో తాము ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదని డీఎంఈ డాక్టర్ వినోద్ కుమార్ స్పష్టం చేశారు. 

విధుల్లో ఉన్న సమయంలో ఆరోగ్యశాఖ ఉద్యోగులు, వైద్యులు స్టెతస్కోప్, యాప్రాన్, ఐడీ కార్డు ధరించాలన్న అంశంపై ఉద్యోగ, ఇతర సంఘాల నాయకులతో చర్చలు జరుగుతున్నట్టు చెప్పారు. దీనిపై త్వరలోనే మార్గదర్శకాలు విడుదల చేస్తామని డాక్టర్ వినోద్ కుమార్ వివరించారు.

More Telugu News