Varla Ramaiah: చంద్రబాబుపై విజయసాయి సెటైర్లు.. కౌంటర్ ఇచ్చిన వర్ల రామయ్య

Varla Ramaiah slams Vijayasai Reddy
షార్ట్స్‌లో చూడండి
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో టీడీపీ నాయకత్వంపై తీవ్రస్థాయిలో విమర్శనాస్త్రాలు సంధిస్తుండడం తెలిసిందే. తాజాగా విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో స్పందిస్తూ.... కేంద్ర భద్రతా దళాల జడ్ ప్లస్ సెక్యూరిటీలో ఉండి కూడా ఎవరో చంపేస్తారంటూ చలిజ్వరం వచ్చినవాడిలా వణుకుతున్నాడంటూ చంద్రబాబుపై విమర్శలు చేశారు. టీడీపీని తెలుగు డ్రామాల పార్టీగా అభివర్ణించిన విజయసాయి... ఇదేమి ఖర్మ బాబు? రాజకీయాల నుంచి రిటైరై దుప్పటి కప్పుకుని పడుకో అంటూ ఎద్దేవా చేశారు. 

ఈ నేపథ్యంలో, విజయసాయిరెడ్డిపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ధ్వజమెత్తారు. విజయసాయిరెడ్డి గారూ... మీకు చింత చచ్చినా పులుపు చావలేదు... ఇంకా నిస్సిగ్గుగా చంద్రబాబుపై అవాకులు చవాకులు పేలుతున్నారు అని విమర్శించారు. ఫోను పోయిందని మీరాడిన దొంగనాటకం రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిపోయింది అని వర్ల రామయ్య వ్యాఖ్యానించారు. ఈడీ వేగం ఇలాగే కొనసాగితే మూడు నెలల్లో తప్పకుండా అరెస్టవుతారు... జైలుకెళతారు అని పేర్కొన్నారు. 
Go Back to Shorts
Varla Ramaiah
Vijayasai Reddy
Chandrababu
TDP
YSRCP

More Telugu News