పెళ్లి విందులో చికెన్ వడ్డించలేదని వరుడి స్నేహితుల గొడవ.. ఆగిన వివాహం!
- సోమవారం జరగాల్సిన వివాహం
- ఆదివారం రాత్రి విందు ఇచ్చిన వధువు కుటుంబం
- భోజనానికి వచ్చి చికెన్ లేదని గొడవ పడి వెళ్లిపోయిన వరుడి స్నేహితులు
- ఆగిపోయిన పెళ్లి.. పోలీస్ స్టేషన్‌కు చేరిన పంచాయితీ
- కౌన్సెలింగ్‌తో దిగివచ్చిన మగపెళ్లివారు
విందు ఇక ముగుస్తుందన్న సమయంలో వరుడి తరపు స్నేహితులు భోజనాలకు వచ్చారు. అక్కడున్న శాకాహార వంటలు చూసి చికెన్ ఎందుకు పెట్టలేదని ప్రశ్నించి గొడవపడి తినకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇది వధూవరుల కుటుంబాల మధ్య గొడవకు కారణమైంది. చివరికి నిన్న జరగాల్సిన వివాహం ఆగిపోయింది. దీంతో వధువు కుటుంబ సభ్యులు జీడిమెట్ల సీఐని కలిసి ఫిర్యాదు చేశారు. ఆయన ఇరు కుటుంబ సభ్యులను పిలిపించి కౌన్సెలింగ్ ఇవ్వడంతో రేపు (బుధవారం) వివాహం జరిపించాలని నిర్ణయించారు.