YS Bharathi: వైఎస్ భారతి ఆస్తుల ఈడీ అటాచ్ పై తెలంగాణ హైకోర్టులో విచారణ

  • జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ దర్యాప్తు
  • వైఎస్ భారతి ఆస్తుల అటాచ్
  • తెలంగాణ హైకోర్టులో పిటిషన్
  • పలు భూములు, భవనాలు, షేర్ల విడుదలకు కోర్టు ఆదేశం
  • ఫిక్స్ డ్ డిపాజిట్లు అటాచ్ చేయాలని స్పష్టీకరణ
Telangana high court hearing on ED attachment of YS Bharati assets

వైఎస్ భారతి ఆస్తులను ఈడీ అటాచ్ చేయడంపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. వాదనలు విన్న ధర్మాసనం రాయదుర్గంలోని భూమి, సండూర్ షేర్లను జప్తు నుంచి విడుదల చేయాలని ఆదేశించింది. సిలికాన్ బిల్డర్స్, భగవత్ సన్నిధి భూములు, భవనాలు, రేవా ఇన్ ఫ్రా భూములు, భవనాల విడుదలకు ఆదేశాలు ఇచ్చింది. 

భూమి, షేర్లకు సమాన విలువ కలిగిన ఫిక్స్ డ్ డిపాజిట్లను అటాచ్ చేయాలని పేర్కొంది. ఫిక్స్ డ్ డిపాజిట్లు తీసుకుని బెంగళూరులోని భూములు విడుదల చేయాలని తెలంగాణ హైకోర్టు సూచించింది. అయితే అటాచ్ చేసిన రూ.14.29 కోట్లను తిరిగివ్వాలని వైఎస్ భారతి చేసిన అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది.

More Telugu News