Pushpa: రష్యాలో విడుదలవుతున్న 'పుష్ప'

  • అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప
  • గత డిసెంబరు 17న రిలీజ్
  • ప్రపంచ వ్యాప్తంగా రూ.300 కోట్ల కలెక్షన్లు 
  • డిసెంబరు 8న రష్యా థియేటర్లలో విడుదల  
Pushpa set to release in Russia

గతేడాది డిసెంబరు 17న విడుదలైన 'పుష్ప' చిత్రం బాక్సాఫీసు వద్ద ఎంతటి ప్రభంజనం సృష్టించిందో తెలిసిందే. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన ఈ యాక్షన్ ఎంటర్టయినర్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 3 వేల థియేటర్లలో రిలీజై రూ.300 కోట్లకుపైగా రాబట్టింది. 

కాగా 'పుష్ప' చిత్రం ఇప్పుడు రష్యాలోనూ విడుదల కానుంది. 'పుష్ప ది రైజ్' చిత్రం రష్యాలో డిసెంబరు 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని రష్యా భాషలోకి డబ్ చేసి విడుదల చేస్తుండడం విశేషం. 

విడుదలకు ముందు డిసెంబరు 1న మాస్కోలో, డిసెంబరు 3న సెయింట్ పీటర్స్ బర్గ్ లో పుష్ప ప్రీమియర్ షోలు ప్రదర్శించనున్నారు. ఈ మేరకు చిత్రనిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఓ ప్రకటనలో తెలిపింది. కాగా, రష్యన్ భాషలో పుష్ప ట్రైలర్ రేపు ఉదయం 11.07 గంటలకు విడుదల అవుతుందని వెల్లడించింది. 

More Telugu News