Kiara Advani: 2న గుడ్ న్యూస్ చెబుతానంటున్న కియారా అద్వానీ

Kiara Advani and Sidharth Malhotra to announce their wedding on Dec 2
  • ఎంతో కాలం పాటు రహస్యంగా కొనసాగించలేమన్న కియారా
  • వెల్లడిస్తా.. వేచి ఉండాలంటూ ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్
  • పెళ్లి గురించా? లేక కొత్త సినిమా గురించా? అన్న సందేహాలు
ప్రస్తుతం బాలీవుడ్ లో రాణిస్తున్న హీరోయిన్లలో కియారా అద్వానీ కూడా ఒకరు. అందమైన, నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలతో ఆమె ఎంతో మంది అభిమానాన్ని చూరగొంది. 2019లో వచ్చిన కబీర్ సింగ్ సినిమా ఆమె నటనకు చక్కని నిదర్శనం. ఆమె కొంత కాలం నుంచి సిద్ధార్థ మల్హోత్రాతో సహజీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో తాను డిసెంబర్ 2వ తేదీన మీకో విషయం చెబుతానని ప్రకటించడం అభిమానుల్లో ఆసక్తిని పెంచింది. 

సిర్ధార్థతో తన వివాహం గురించే కియారా ప్రకటన చేయనుందా? అన్న ఆసక్తి నెలకొంది. ‘‘ఎంతో కాలం పాటు దీన్ని రహస్యంగా కొనసాగించలేం. త్వరలోనే వెల్లడిస్తా.. వేచి ఉండండి.. డిసెంబర్ 2’’ అంటూ ఇన్ స్టా గ్రామ్ లో కియారా ఓ చిన్న సందేశాన్ని పోస్ట్ చేసింది. దీనికి జతగా నవ్వులు చిందిస్తున్న చిన్నపాటి వీడియో క్లిప్ ను జత చేసింది. అయితే, పెళ్లి గురించి కాకపోయి ఉండొచ్చని కొందరు భావిస్తున్నారు. ఓ యాడ్ ఫిల్మ్ లేదంటే కొత్త సినిమా గురించి అయి ఉండొచ్చన్న ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి. మరి ఈ సస్పెన్స్ ను కియారానే డిసెంబర్ 2న తొలగించనుంది. (ఇన్ స్టా గ్రామ్ వీడియో కోసం)
Kiara Advani
revealing
announce
december 2nd
marriage
Sidharth Malhotra

More Telugu News