Pawan Kalyan: అన్నమయ్య డ్యాం లస్కర్ కు రూ.2 లక్షలు అందించిన పవన్ కల్యాణ్

Pawan Kalyan met Annamayya dam expatriates
  • అన్నమయ్య డ్యాం నిర్వాసితులతో పవన్ సమావేశం
  • ఇసుక తవ్వకాల వల్లే డ్యాం కొట్టుకుపోయిందని వ్యాఖ్యలు
  • లస్కర్ రామయ్య ఎన్నో ప్రాణాలు కాపాడాడని వెల్లడి
జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ నేడు అన్నమయ్య డ్యాం నిర్వాసితులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా అన్నమయ్య డ్యాం లస్కర్ రామయ్యకు పవన్ కల్యాణ్ రూ.2 లక్షల చెక్కును అందించారు. 

ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, విచక్షణ లేకుండా ఇసుక తవ్వకాలకు పాల్పడడం వల్లే అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయిందని అన్నారు. చెట్లు నరికే వ్యక్తులు గరుడ పురాణం చదవాలని సూచించారు. మీ బాధ్యతారాహిత్యం వల్లే డ్యామ్ కొట్టుకుపోయిందని పవన్ కల్యాణ్ ఆరోపించారు.  నాడు లస్కర్ రామయ్య లేకపోతే మరింత ప్రాణనష్టం జరిగేదని అభిప్రాయపడ్డారు. విపత్తు నిర్వహణ సంస్థ చేయాల్సిన పనిని రామయ్య చేశారని కొనియాడారు. దాదాపు 200 మంది ప్రాణాలను రామయ్య కాపాడారని తెలిపారు. 

ఇక, బాక్సర్ వంశీకృష్ణకు రూ.50 వేల ఆర్థిక సాయం చెక్కు అందజేశారు. జాతీయస్థాయి క్రీడాకారుడు నష్టపోతుంటే పట్టించుకోలేదని విమర్శించారు. వంశీకృష్ణ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకునేందుకు ఆర్థికసాయం చేస్తామని పవన్ కల్యాణ్ చెప్పారు.
Pawan Kalyan
Annamayya Dam
Ramaiah
Vamsikrishna
Janasena

More Telugu News