Krishna: హైదరాబాదులో ఘనంగా సూపర్ స్టార్ కృష్ణ దశదిన కార్యక్రమం

Superstar Krishna eleventh day rituals held in Hyderabad
  • ఇటీవల సూపర్ స్టార్ కృష్ణ కన్నుమూత
  • దశదిన కార్యక్రమం నిర్వహించిన కుటుంబ సభ్యులు
  • హైదరాబాదులో రెండు చోట్ల విందు
  • అభిమానులకు జేఆర్సీ కన్వెన్షన్ లో విందు
  • ఎన్ కన్వెన్షన్ లో ప్రముఖులకు విందు
వెండితెర సూపర్ స్టార్ కృష్ణ నవంబరు 15న కన్నుమూసిన సంగతి తెలిసిందే. కృష్ణ దశదిన కర్మ కార్యక్రమం నేడు హైదరాబాదులో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. 

దశదిన కార్యక్రమం సందర్భంగా భారీ భోజన ఏర్పాట్లు చేశారు. సినీ, రాజకీయ ప్రముఖుల కోసం ఎన్ కన్వెన్షన్ లో, అభిమానుల కోసం జేఆర్సీ కన్వెన్షన్ లో విందు ఏర్పాటు చేశారు. అభిమానుల కోసం 5 వేల పాసులు అందించారు. ఈ విందులో 32 రకాల వంటకాలు వడ్డించినట్టు తెలుస్తోంది. 

కృష్ణ దశ దిన కార్యక్రమానికి మహేశ్ బాబు సహా ఆయన కుటుంబ సభ్యులందరూ విచ్చేశారు. ఈ కార్యక్రమంలో మహేశ్ బాబు మాట్లాడుతూ భావోద్వేగ భరిత వ్యాఖ్యలు చేశారు. "మా నాన్న గారు నాకు ఎన్నో ఇచ్చారు... ఆయన ఇచ్చిన వాటిలో అన్నింటికన్నా గొప్పది... మీ అభిమానం. అందుకు ఆయనకు ఎప్పుడూ రుణపడి ఉంటాను. నాన్న గారు ఎప్పటికీ నా హృదయంలో, మీ హృదయాల్లో నిలిచే ఉంటారు. ఆయన ఎప్పటికీ మన మధ్యే ఉంటారు. అభిమానుల్ని కలుసుకోవడం ఆనందం కలిగిస్తోంది. నాపై మీ అభిమానం, మీ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటాను" అంటూ అభిమానులను ఉద్దేశించి ప్రసంగించారు.
Krishna
Demise
Mahesh Babu
Fans
Hyderabad
Tollywood

More Telugu News