కొడాని నాని, వల్లభనేని వంశీ పేదల సొమ్ము కొట్టేశారు: టీడీపీ నేత పట్టాభి
- బినామీలతో సంకల్పసిద్ధి సంస్థను స్థాపించారన్న పట్టాభిరాం
- కంపెనీ రిజిస్టర్ అయిన తర్వాత రెండు, మూడు నెలలు వంశీ మాయమయ్యాడని వ్యాఖ్య
- వీరిద్దరిపై కేసు నమోదు చేయాలని డిమాండ్
బోగస్ కంపెనీ సంకల్పసిద్ధి రిజిస్టర్ అయిన తర్వాత వల్లభనేని వంశీ రెండు, మూడు నెలలు ఎందుకు మాయమయ్యారని పట్టాభి ప్రశ్నించారు. కొట్టేసిన పేదల సొమ్మును దాచుకునేందుకు మాయమయ్యారా? అని అడిగారు. గన్నవరం నియోజకవర్గంతో పేదల ప్రాణాలు డయేరియాతో పోతున్నా వంశీ ఎందుకు కనపడలేదని ప్రశ్నించారు. పేదల సొమ్మును కొట్టేసిన నాని, వంశీలపై కేసులు నమోదు చేయడం ద్వారా సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని అన్నారు. తాడేపల్లి ప్యాలెస్ కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతోందని ఆరోపించారు. దీనికి సంబంధించిన వార్తను సాక్షి పత్రికలో ఎందుకు ప్రచురించలేదని ప్రశ్నించారు.