Kodali Nani: కొడాని నాని, వల్లభనేని వంశీ పేదల సొమ్ము కొట్టేశారు: టీడీపీ నేత పట్టాభి

  • బినామీలతో సంకల్పసిద్ధి సంస్థను స్థాపించారన్న పట్టాభిరాం
  • కంపెనీ రిజిస్టర్ అయిన తర్వాత రెండు, మూడు నెలలు వంశీ మాయమయ్యాడని వ్యాఖ్య
  • వీరిద్దరిపై కేసు నమోదు చేయాలని డిమాండ్
Kodali Nani and Vallabhaneni Vamsi looted poor peoples money says Pattabhi

లక్ష రూపాయల పెట్టుబడితో ప్రారంభమైన సంకల్పసిద్ధి ఈమార్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ రూ. 1,100 కోట్ల భారీ స్కామ్ కు పాల్పడిందని టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిరాం అన్నారు. మాజీ మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీల ప్రధాన అనుచరుడు ఓలుపల్లి రంగా సహాయంతో గుత్తా వేణుగోపాల్ కృష్ణ, కిరణ్ అనే బినామీలను పెట్టుకుని ఈ సంస్థను స్థాపించారని చెప్పారు. రూ. 20 వేలు కడితే 10 నెలల్లో రూ. 60 వేలు ఇస్తామని నమ్మబలికి మోసం చేశారని అన్నారు. 

బోగస్ కంపెనీ సంకల్పసిద్ధి రిజిస్టర్ అయిన తర్వాత వల్లభనేని వంశీ రెండు, మూడు నెలలు ఎందుకు మాయమయ్యారని పట్టాభి ప్రశ్నించారు. కొట్టేసిన పేదల సొమ్మును దాచుకునేందుకు మాయమయ్యారా? అని అడిగారు. గన్నవరం నియోజకవర్గంతో పేదల ప్రాణాలు డయేరియాతో పోతున్నా వంశీ ఎందుకు కనపడలేదని ప్రశ్నించారు. పేదల సొమ్మును కొట్టేసిన నాని, వంశీలపై కేసులు నమోదు చేయడం ద్వారా సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని అన్నారు. తాడేపల్లి ప్యాలెస్ కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతోందని ఆరోపించారు. దీనికి సంబంధించిన వార్తను సాక్షి పత్రికలో ఎందుకు ప్రచురించలేదని ప్రశ్నించారు.

More Telugu News