పట్టణాల్లో తగ్గిన నిరుద్యోగం.. తాజా గణాంకాల విడుదల
- సెప్టెంబర్ త్రైమాసికంలో 7.2 శాతానికి పరిమితం
- అంతకుముందు మూడు నెలల కాలంలో ఇది 7.6 శాతం
- పురుషుల కంటే మహిళల్లో నిరుద్యోగం ఎక్కువ
ఈ రేటు ఎప్పుడూ స్థిరంగా ఉండదు. ఆర్థిక కార్యకలాపాలు, డిమాండ్ కు తగ్గట్టు నిరుద్యోగం మారిపోతుంటుంది. 39.7 శాతం మంది సొంత కాళ్లపై (స్వయం ఉపాధి) నిలబడగా, క్యాజువల్ వర్కర్ల శాతం 11.6 శాతంగా నమోదైంది. వ్యవసాయ రంగ కార్మికుల శాతం 5.9 నుంచి 5.7కు తగ్గింది. 15 ఏళ్లు నిండి, పనిచేసే సామర్థ్యం ఉన్న వారి గణాంకాల ఆధారంగా నిరుద్యోగాన్ని అంచనా వేస్తుంటారు. పురుషుల్లో నిరుద్యోగులు 6.6 శాతంగా ఉంటే, మహిళల్లో నిరుద్యోగ రేటు 9.4 శాతంగా ఉంది. గతేడాది ఇదే కాలంలో ఇవి వరుసగా 9.3 శాతం, 11.6 శాతం చొప్పున ఉన్నాయి.