కేంద్ర ప్రభుత్వ కీలక సమావేశానికి మరోసారి మంత్రి హరీశ్ రావు దూరం
- నిర్మలా సీతారామన్ అధ్యక్షతన ఢిల్లీలో ప్రీ బడ్జెట్ సమావేశం
- హాజరైన అన్ని రాష్ట్రాల ఆర్థికమంత్రులు, కార్యదర్శులు
- వరుసగా రెండో పర్యాయం దూరంగా ఉన్న హరీశ్ రావు
2023- 24 బడ్జెట్టుపై కసరత్తులో భాగంగా.. బడ్జెట్ ప్రతిపాదనలపై సమావేశానికి అన్ని రాష్ట్రాల ఆర్థిక శాఖ మంత్రులు, కార్యదర్శులు హాజరయ్యారు. ఏపీ నుంచి ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సమావేశానికి హాజరయ్యారు. తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు మాత్రం సమావేశానికి దూరంగా ఉన్నారు. ఇలా ప్రీ బడ్జెట్ సమావేశాలకు ఆయన గైర్హాజరవడం ఇది రెండో పర్యాయం. దీంతో రాష్ట్రం తరఫున ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రొనాల్డ్ రాస్ ఈ సమావేశంలో పాల్గొంటున్నారు.