కేజ్రీవాల్ ను చంపేందుకు ప్రయత్నిస్తున్నారు: మనీశ్ సిసోడియా
- కార్పొరేషన్ ఎన్నికల్లో ఓడిపోతామని బీజేపీ భయపడుతోందన్న సిసోడియా
- మనోజ్ తివారీ నేతృత్వంలో హత్యకు కుట్ర జరుగుతోందని ఆరోపణ
- ఇప్పటికే పక్కా ప్లాన్ సిద్ధం చేశారని వ్యాఖ్య
కేజ్రీవాల్ గురించి మనోజ్ తివారీ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో సిసోడియా ఈ ఆరోపణలు చేశారు. అంతులేకుండా కొనసాగుతున్న అవినీతి, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టికెట్లను అమ్ముకోవడం, రేపిస్టులతో స్నేహం, జైల్లో ఆప్ మంత్రికి మసాజులు వంటి పరిణామాల పట్ల ఆప్ కార్యకర్తలు ఆగ్రహంతో ఉన్నారని... కేజ్రీవాల్ భద్రతపై తనకు ఆందోళనగా ఉందని మనోజ్ అన్నారు. ఇప్పటికే ఆప్ ఎమ్మెల్యేలను ప్రజలు చితకబాదిన ఘటనలను కూడా చూశామని... ఇలాంటి అనుభవం ఢిల్లీ ముఖ్యమంత్రికి ఎదురు కాకూడదని కోరుకుంటున్నానని చెప్పారు. ఈ వ్యాఖ్యలకు సిసోడియా కౌంటర్ ఇచ్చారు.