Somireddy Chandra Mohan Reddy: కాకాణిని మంత్రి పదవి నుంచి తొలగించాలి: సోమిరెడ్డి

  • నాపై తప్పుడు ఆరోపణలు చేసి, తప్పుడు పత్రాలు తీసుకొచ్చారన్న సోమిరెడ్డి 
  • కోర్టులో ఉన్న పత్రాలను చోరీ చేశారని ఆరోపణలు 
  • కేసును సీబీఐకి అప్పగించడాన్ని స్వాగతిస్తున్నానని వ్యాఖ్య 
Somireddy demands Jagan to dismiss Kakani from cabinet

తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ, తప్పుడు పత్రాలను తీసుకొచ్చారంటూ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. కోర్టు అధీనంలో ఉన్న ఈ తప్పుడు పత్రాలను చోరీ చేశారని అన్నారు. అసలే తప్పుడు పత్రాలు... అవి కూడా చోరీకి గురయ్యాయని చెప్పారు. ఇలాంటి నేరాలు చేసిన వ్యక్తిని ముఖ్యమంత్రి జగన్ వెంటనే కేబినెట్ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు ఆదేశించడాన్ని స్వాగతిస్తున్నానని చెప్పారు.

More Telugu News