తెల్లవారుజామునే రంగంలోకి ఐటీ అధికారులు.. తెలంగాణ రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి ఇళ్లు, కార్యాలయాలపై దాడులు

IT Raids on Telangana minister Ch Malla Reddy
  • బృందాలుగా విడిపోయి సోదాలు చేస్తున్న ఐటీశాఖ అధికారులు
  • కుమారుడు, అల్లుడి ఇళ్లలోనూ కొనసాగుతున్న సోదాలు
  • తనిఖీల్లో పాల్గొన్న 50 బృందాలు
తెలంగాణ రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి ఇళ్లు, కార్యాలయాలపై ఆదాయ పన్ను శాఖ ఈ తెల్లవారుజాము నుంచి దాడులు మొదలుపెట్టింది. పలు బృందాలుగా విడిపోయిన అధికారులు మల్లారెడ్డి, ఆయన కుమారుడు మహేందర్‌రెడ్డి, అల్లుడు మర్రి రాజశేఖరరెడ్డి ఇళ్లు, వ్యాపార సముదాయాలు, కార్యాలయాల్లో సోదాలు చేస్తున్నారు. 

కొంపల్లిలోని పాం మెడోస్ విల్లాలోనూ సోదాలు చేపట్టారు. దాదాపు 50 బృందాలు ఏక కాలంలో ఈ తనిఖీల్లో పాల్గొన్నాయి. కాగా, మల్లారెడ్డి కాలేజీలకు మహేందర్‌రెడ్డి డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.

Go Back to Shorts
Telangana
Ch Malla Reddy
IT Raids

More Telugu News