Manish Sisodia: జైల్లో సత్యేంద్రజైన్ కు వీవీఐపీ ట్రీట్మెంట్ పై మనీశ్ సిసోడియా స్పందన

Manish Sisodias response on VVIP treatment to Satyendra Jain
  • సత్యేంద్ర జైన్ రెండు సర్జరీలు చేయించుకున్నారన్న మనీశ్ సిసోడియా
  • దీంతో ఆయన ఫిజియోథెరపీ చేయించుకుంటున్నారని వెల్లడి
  • వీడియోను విడుదల చేయడం ఒక చీప్ స్టంట్ అంటూ విమర్శ   
ఆప్ నేత, ఢిల్లీ మంత్రి సత్యేంద్రజైన్ జైల్లో వీవీఐపీ ట్రీట్మెంట్ పొందుతున్న వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఆయన కాళ్లకు మసాజ్ చేస్తున్నట్టున్న వీడియో బయటకు వచ్చింది. దీనిపై ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా మాట్లాడుతూ, జైల్లో అనారోగ్యంతో బాధ పడుతున్న నేతను ఉద్దేశించి పరిహసించేలా మాట్లాడటం మంచిది కాదని అన్నారు. 

సత్యేంద్ర జైన్ రెండు సర్జరీలు చేయించుకున్నారని, ఈ కారణంగానే ఆయన రెగ్యులర్ గా ఫిజియోథెరపీ చేయించుకుంటున్నారని చెప్పారు. ఈ వీడియో లీక్ కావడం అసాధారణమైన విషయమేమీ కాదని తెలిపారు. అనారోగ్యం ఎవరికైనా వస్తుందని, ప్రధాని కూడా అనారోగ్యానికి గురవుతారని సిసోడియా అన్నారు. అనారోగ్యానికి గురైన వ్యక్తి చికిత్సకు సంబంధించిన వీడియోను విడుదల చేయడం ఒక చీప్ స్టంట్ అని విమర్శించారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో గెలవడం కోసమే బీజేపీ ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని చెప్పారు.
Manish Sisodia
Satyndra Jain
AAP
BJP

More Telugu News