డిసెంబరు 3న ఆంధ్రా క్రికెట్ సంఘం ఎన్నికలు
- ఎన్నికలకు సిద్ధమవుతున్న ఏసీఏ
- డిసెంబరు 3 ఉదయం 10 గంటలకు పోలింగ్
- అదే రోజు మధ్యాహ్నం ఒంటిగంటకు ఫలితాలు
- కీలక పదవులకు ఎన్నికలు
- ఏసీఏ నియమనిబంధనల ప్రకారం ఎన్నికల ప్రక్రియ
డిసెంబరు 3వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. అనంతరం మధ్యాహ్నం ఒంటిగంటకు ఫలితాలు వెల్లడిస్తారు. ఆంధ్రా క్రికెట్ సంఘం నియమావళి మేరకు ఈ ఎన్నికలు నిర్వహించనున్నారు.
గత కొంతకాలంగా ఆంధ్రా క్రికెట్ సంఘం మెరుగైన పనితీరుతో బీసీసీఐని ఆకట్టుకుంటోంది. ఆంధ్రా జట్టు నుంచి వచ్చిన ఎమ్మెస్కే ప్రసాద్ జాతీయ జట్టులో చోటు సంపాదించడమే కాదు, రిటైర్ అయిన తర్వాత టీమిండియా చీఫ్ సెలెక్టర్ గానూ పనిచేశాడు. యువ క్రికెటర్లు హనుమ విహారి, శ్రీకర్ భరత్ వంటి ప్రతిభావంతులు ఇప్పుడు టీమిండియా ఆటగాళ్ల జాబితాలో ఉన్నారు. రికీ భుయ్ తదితరులు దేశవాళీల్లో విశేషంగా రాణిస్తున్నారు.