Jockey: తెలంగాణలో రెండు చోట్ల 'జాకీ' అండర్ వేర్స్ పరిశ్రమలు

Jockey inner ware industry comes to Telangana
  • తెలంగాణలో జాకీ లో దుస్తుల కంపెనీల స్థాపన
  • ఇబ్రహీంపట్నం, ములుగులో యూనిట్లు
  • కేటీఆర్ తో కంపెనీ ప్రతినిధుల భేటీ
  • 7 వేల ఉద్యోగాలు వస్తాయన్న కేటీఆర్
ప్రముఖ అండర్ వేర్ గార్మెంట్స్ ఉత్పత్తిదారు జాకీ తెలంగాణలో పరిశ్రమ స్థాపించనుంది. జాకీ మాతృసంస్థ పేజ్ ఇండస్ట్రీస్ ప్రతినిధులు నేడు తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ తో సమావేశమయ్యారు. దీనికి సంబంధించిన వివరాలను కేటీఆర్ ట్విట్టర్లో వెల్లడించారు. 

ఎంతో ప్రజాదరణ పొందిన లో దుస్తుల సంస్థ జాకీ (పేజ్ ఇండస్ట్రీస్) తెలంగాణలో రెండు చోట్ల పరిశ్రమలు స్థాపించనుందని తెలిపారు. ఇబ్రహీంపట్నం, ములుగు ప్రాంతాల్లో జాకీ మాన్యుఫాక్చరింగ్ యూనిట్లు నెలకొల్పనుందని కేటీఆర్ వివరించారు. 1 కోటి లో దుస్తులు ఉత్పత్తి చేయనుందని, జాకీ ఫ్యాక్టరీలతో 7 వేల ఉద్యోగాలు లభిస్తాయని వెల్లడించారు. తెలంగాణలో జాకీ సంస్థకు హార్దిక స్వాగతం పలుకుతున్నామని తెలిపారు.
Jockey
Telangana
KTR
Industry

More Telugu News