Ayesha Omar: సానియా, షోయబ్ కాపురంపై రూమర్ల నేపథ్యంలో ఈవిడ ఫొటోలు వైరల్!

Pakistani actress Ayesha Omar name surfaced in Sania and Shoiab issue
  • 2010లో సానియా, షోయబ్ వివాహం
  • వీరు విడిపోతున్నారంటూ తాజాగా కథనాలు
  • ఓ నటితో షోయబ్ సాన్నిహిత్యమే అందుకు కారణమని ప్రచారం
  • తెరపైకి నటి ఆయేషా ఒమర్ పేరు
భారత టెన్నిస్ తార సానియా మీర్జా, పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ కాపురంలో కలతలు అంటూ గత కొన్నిరోజులుగా తీవ్రస్థాయిలో ప్రచారం జరుగుతోంది. వీరిద్దరూ విడిపోనున్నారంటూ కథనాలు వస్తున్నాయి. ఇటు సానియా గానీ, అటు షోయబ్ గానీ వీటిపై స్పందించకపోవడంతో ఊహాగానాలకు అడ్డుకట్ట పడడంలేదు. 

కాగా, షోయబ్ మాలిక్ పాకిస్థానీ నటి ఆయేషా ఒమర్ తో సన్నిహితంగా మెలుగుతుండడంతో సానియా తీవ్ర అసంతృప్తికి గురైనట్టు పాకిస్థాన్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో, నటి ఆయేషా ఒమర్ సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడామె ఫొటోలు, కథనాలు వైరల్ అవుతున్నాయి. 

పలు సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో ఈ అమ్మడి ఫొటోలే దర్శనమిస్తున్నాయి. ఆయేషా ఒమర్ ఫొటో పోస్టు చేసి సానియా, షోయబ్ వైవాహిక జీవితంపై కథనాలు అల్లేస్తున్నారు. 

ఆయేషా... పాకిస్థాన్ లో అత్యధిక పారితోషికం అందుకునే హీరోయిన్. సోషల్ మీడియాలో ఆమెకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇటీవల షోయబ్, ఆయేషా ఓ మ్యాగజైన్ కోసం ఫొటోషూట్ చేయడంతో రూమర్లు మరింత ముదిరాయి. పైగా, ఆయేషా క్రికెట్ అభిమాని కూడా. పాక్ జట్టు ఆడిన పలు మ్యాచ్ లకు ఆమె స్టేడియంకు వచ్చి తమ ఆటగాళ్లను ప్రోత్సహించేది.

అయితే, సానియా పుట్టినరోజుకు షోయబ్ శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేయడం విశేషం. అంతేకాదు, వీరిరువురు కలిసి ఉర్దు ఫ్లిక్స్ ఓటీటీలో ది మీర్జా మాలిక్ షో పేరిట ఓ కార్యక్రమానికి హోస్ట్ లుగా వ్యవహరించనున్నారు. మరి ఇకనైనా వీరి దాంపత్యంపై రూమర్లకు అడ్డుకట్ట పడుతుందో లేదో చూడాలి. 
Ayesha Omar
Sania Mirza
Shoaib Malik
Pakistan
India

More Telugu News