Krishna: కృష్ణ గారి సరసన ప్రతి హీరోయిన్ ఎంతో సౌకర్యంగా ఫీలయ్యేవాళ్లు: రాధ

Radha condolences to Superstar Krishna demise

  • సూపర్ స్టార్ కృష్ణ కన్నుమూత
  • గుండె పగిలినట్టయిందన్న రాధ
  • ఆయనతో నటించడాన్ని గర్వంగా భావిస్తానని వెల్లడి
  • మహేశ్ బాబు, ఇతర కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం

సూపర్ స్టార్ కృష్ణ మృతి పట్ల అలనాటి ప్రముఖ హీరోయిన్ రాధ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కృష్ణ గారు లెజెండరీ యాక్టర్ అని, ఆయన ఇక లేరన్న విషయం తెలిసి గుండె పగిలినట్టయిందని పేర్కొన్నారు. 

ఆయన సరసన నటించడాన్ని గర్వంగా భావిస్తానని తెలిపారు. తామిద్దరం కలిసి అనేక చిత్రాల్లో నటించామని, అప్పట్లో తమది హిట్ జోడీ అనేవాళ్లని రాధ వెల్లడించారు. తమ కాంబినేషన్ ను ప్రతి ఒక్కరూ ఆస్వాదించేవాళ్లని వివరించారు. 

కృష్ణ గారి పక్కన నటించే ప్రతి హీరోయిన్ ఎంతో సౌకర్యవంతంగా ఫీలయ్యేవాళ్లని తెలిపారు. తెరపైనే కాదు, వెలుపల కూడా ఉన్నతమైన వ్యక్తి అని రాధ కొనియాడారు. ఈ విషాద సమయంలో మహేశ బాబుకు, ఇతర కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నానని వెల్లడించారు. కాగా, కృష్ణ-రాధ కాంబినేషన్ లో 23 సినిమాలు వచ్చాయి. వాటిలో అత్యధిక చిత్రాలు సూపర్ హిట్లయ్యాయి.

Krishna
Superstar
Radha
Demise
Tollywood
  • Loading...

More Telugu News