TRS: కేటీఆర్ లా కనిపిస్తున్నారంటే... సినిమా డైలాగ్ తో ఆన్సరిచ్చిన హిమాన్షు

ktr son himanshu viral reply to a tweet which praises him as ktr
  • సోషల్ మీడియాలో యాక్టివ్ గా హిమాన్షు రావు
  • తన తాజా ఫొటోను చూసి కేటీఆర్ కనిపించారంటూ ఓ క్రికెటర్ పోస్ట్
  • సర్సర్లే ఎన్నెన్నో అనుకుంటాం అంటూ రిప్లై ఇచ్చిన కేటీఆర్ తనయుడు
కల్వకుంట్ల హిమాన్షు రావు తన తండ్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాదిరే సోషల్ మీడియాలో యాక్టివ్ గానే ఉంటారు. కేటీఆర్ అంతగా కాకపోయినా... తరచూ నెట్టింట ప్రవేశించే హిమాన్షు తన మిత్రులు, టీఆర్ఎస్ శ్రేణులు తనకు మాత్రమే పంపిన పోస్టులను చూస్తూ ఉంటారు. వాటికి సమాధానాలు కూడా ఇస్తూ ఉంటారు. అయితే రాజకీయ వ్యాఖ్యలకు మాత్రం దూరంగానే ఉంటారు.

కేసీఆర్ తో పాటు కేటీఆర్ అంటే విపరీతమైన అభిమానం కలిగిన క్రికెటర్ అక్షయ్... సోమవారం హిమాన్షు ఫొటోను ట్వీట్ చేస్తూ.... ''సడెన్ గా చూసి కేటీఆర్ అన్న అనుకున్నా'' అంటూ ఓ కామెంట్ పెట్టారు. ఈ ట్వీట్ ను నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత చూసుకున్న హిమాన్షు... ఆ పోస్టుకు ఓ సినిమా డైలాగ్ తో అదిరిపోయే రిప్లై ఇచ్చారు. ''సర్సర్లే ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయా? ఏంటీ?'' అన్న సినిమా డైలాగ్ ను ప్రస్తావించిన హిమాన్షు... ఆ వ్యాఖ్యలను ఓ పెద్ద మనిషి చెప్పారంటూ పేర్కొన్నారు. చివరగా ''ఈ జోక్ ను వదిలేస్తే... మీ కాంప్లిమెంట్ కు ధ్యాంక్స్'' అంటూ ముగించారు.
TRS
KTR
Himanshu
Social Media
Twitter

More Telugu News