Krishna: సూపర్ స్టార్ కృష్ణ కెరీర్ రికార్డులు ఇవిగో!

  • ఈ వేకువజామున తుదిశ్వాస విడిచిన కృష్ణ
  • తెలుగు సినీ రంగంపై చెరగని సంతకం
  • కొత్తదనానికి ఆద్యుడిగా కృష్ణకు ప్రత్యేక గుర్తింపు
  • మరెవరికీ దక్కని ఘనతలు సొంతం
Superstar Krishna career statistics

తెలుగు చిత్రసీమను, అభిమానులను, కుటుంబ సభ్యులను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ సూపర్ స్టార్ కృష్ణ తిరిగిరాని లోకాలకు పయనం అయ్యారు. అయితే తెలుగు ఫిలిం ఇండస్ట్రీపై ఆయన చెరగని ముద్రవేశారు. కేవలం నటన ప్రతిభతోనే కాకుండా, తన సాహస ప్రవృత్తితో చిత్రపరిశ్రమను కొత్త పుంతలు తొక్కించిన మార్గదర్శకుడిగా నిలిచారు. 

టాలీవుడ్ వెండితెరకు అనేక సాంకేతిక పరిజ్ఞానాలు, కొత్త అంశాలను పరిచయం చేసిన ఆద్యుడు కృష్ణ. మరే హీరోకు సాధ్యంకాని రీతిలో ఆయన చిత్రసీమలో అనేక ఘనతలు సొంతం చేసుకున్నారు. 1964కి ముందు చిన్న పాత్రలు చేసిన కృష్ణ... 1964-65లో తేనె మనసులు చిత్రంతో హీరో అయ్యాక ఇక వెనుదిరిగి చూసుకోలేదు.


కృష్ణ సినీ రికార్డుల వివరాలు...

  • 350కి పైగా చిత్రాల్లో నటించిన కృష్ణ
  • మొదటి చిత్రం- తేనె మనసులు
  • మల్టీ స్టారర్ చిత్రాలు- 50
  • 1983లో కృష్ణ నటించిన 6 చిత్రాలు విజయవాడలో శతదినోత్సవం జరుపుకున్నాయి.
  • తమిళంలోకి డబ్ అయిన కృష్ణ చిత్రాలు-20
  • హిందీలోకి డబ్ అయిన చిత్రాలు- 10
  • కృష్ణ తన కెరీర్ లో 16 సినిమాలకు దర్శకత్వం వహించారు.
  • 1972లో అత్యధికంగా 18 సినిమాల్లో నటించారు.
  • కేఎస్ఆర్ దాస్ దర్శకత్వంలో 31 సినిమాలు చేశారు.
  • కృష్ణతో కలిసి పనిచేసిన మొత్తం దర్శకుల సంఖ్య- 105
  • 1965 నుంచి 2009 వరకు 44 ఏళ్ల పాటు గ్యాప్ లేకుండా నటించిన ఏకైక కథానాయకుడు కృష్ణ.
  • తన 44 ఏళ్ల కెరీర్ లో 30 సినిమాలు సంక్రాంతి రోజున రిలీజ్ చేశారు.
  • కృష్ణ దర్శకత్వం వహించిన తొలి చిత్రం సింహాసనం... ఈ సినిమా 153 థియేటర్లలో రిలీజైంది.
  • కృష్ణ, విజయనిర్మల కాంబినేషన్ లో 50 సినిమాలు వచ్చాయి.
  • కృష్ణతో నటించిన హీరోయిన్ల సంఖ్య 80.
  • కృష్ణ, జయప్రద కాంబినేషన్ లో 45 సినిమాలు వచ్చాయి.
  • కృష్ణ, శ్రీదేవి కాంబినేషన్లో 31 సినిమాలు విడుదల.
  • కృష్ణ ద్విపాత్రాభినయం చేసిన సినిమాలు 25.
  • కృష్ణ త్రిపాత్రాభినయం చేసిన సినిమాలు 7.
  • తెలుగు చలనచిత్ర చరిత్రలో తొలి సూపర్ స్టార్... కృష్ణ
  • కృష్ణకు 2,500కి పైగా అభిమాన సంఘాలు.

More Telugu News