g20: బైడెన్, మోదీల సరదా సంభాషణ.. జి20 దేశాల సదస్సులో కలిసిన నేతలు

Joe Biden share some light moments on sidelines of G20 Summit
  • మోదీ చెబుతుంటే నవ్వుతున్న బైడెన్ 
  • వీడియో ట్వీట్ చేసిన మోదీ కార్యాలయం 
  • ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ కు మోదీ అభినందన 
  • రష్యా-ఉక్రెయిన్ యుద్ధ ప్రస్తావనతో సదస్సు ప్రారంభం
జి20 దేశాల సదస్సు కోసం ఇండోనేషియా వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ ను కలుసుకున్నారు. మంగళవారం ప్రారంభమైన ఈ సదస్సులో పాల్గొనేందుకు మన దేశం తరఫున ప్రధాని మోదీ వెళ్లిన విషయం తెలిసిందే. ఈ వేదికపై కలుసుకున్న మోదీ, బైడెన్ సరదాగా నవ్వుతూ కనిపించారు. మోదీ చెప్పేది వింటూ బైడెన్ సరదాగా నవ్వుతున్న వీడియోను ప్రధాని మోదీ కార్యాలయం ట్వీట్ చేసింది. దీంతో సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ గా మారింది. 

ఆ తర్వాత ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రన్ ను మోదీ కలుసుకున్నారు. మరోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన మాక్రన్ కు మోదీ అభినందనలు తెలిపారు. ఉక్రెయిన్ యుద్ధ ప్రస్తావనతో మొదలు.. రెండు రోజుల పాటు జరగనున్న జి20 దేశాల సదస్సు మంగళవారం ప్రారంభమైంది. ప్రారంభోత్సవ ఉపన్యాసంలో ఉక్రెయిన్-రష్యా యుద్ధాన్ని ప్రస్తావిస్తూ ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో ఈ సమావేశాలను ప్రారంభించారు. ప్రపంచంపట్ల బాధ్యతగా ఫీలయితే వెంటనే యుద్ధానికి ముగింపు పలకాలని రెండు దేశాలను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. 

యుద్ధం ఆగకుంటే ప్రపంచం ముందుకు సాగడం కష్టమని, ఇది మరో ప్రచ్ఛన్న యుద్ధానికి దారితీయొచ్చని జోకో విడోడో ఆందోళన వ్యక్తం చేశారు. సదస్సులో వీటిపై చర్చ.. కరోనా, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ఆహార భద్రత, ఇంధన భద్రత, ఐరోపా సంక్షోభం, ద్రవ్యోల్బణం, ఆర్థిక మాంద్యం తదితర అంశాలపైన జి20 దేశాలు చర్చించనున్నాయి. ప్రపంచం ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లపైన విస్తృతంగా చర్చ జరుగనుంది. ఈ సవాళ్లను అధిగమించేందుకు లీడర్లు మార్గాలు వెతకనున్నారు.
g20
bali
indonesia
modi
biden
fun

More Telugu News