Krishna: కృష్ణ మృతి పట్ల సంతాపం తెలిపిన మోదీ, రాహుల్ గాంధీ

Modi and Rahul pays tributes to Krishna
  • ప్రజల హృదయాలను గెలుచుకున్న లెజెండరీ సూపర్ స్టార్ అన్న మోదీ
  • సినీ ప్రపంచానికి తీరని లోటు అని వ్యాఖ్య
  • చాలా ఆవేదనకు గురయ్యానన్న రాహుల్ గాంధీ
సూపర్ స్టార్ కృష్ణ మృతి పట్ల సినీ రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని మోదీ ట్విట్టర్ ద్వారా తెలుగులో సంతాపాన్ని ప్రకటించారు. 'కృష్ణ గారు తన అద్భుత నటనా కౌశలంతో, ఉన్నతమైన, స్నేహపూర్వకమైన వ్యక్తిత్వంతో ప్రజల హృదయాలను గెలుచుకున్న ఒక లెజెండరీ సూపర్ స్టార్. ఆయన మృతి సినీ ప్రపంచానికి తీరని లోటు. ఈ విషాదకర సమయంలో మహేశ్ బాబుకు, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. ఓం శాంతి' అని ట్వీట్ చేశారు. 

మరోవైపు రాహుల్ గాంధీ స్పందిస్తూ.. తెలుగు సినిమా సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ గారు మరణించారనే వార్తతో చాలా ఆవేదనకు గురయ్యానని చెప్పారు. ప్రజా జీవితంలో ఎలా ఉండాలనే దానికి ఆయన వృత్తిపరమైన క్రమశిక్షణ, విలువలు ఒక ఉదాహరణగా నిలిచిపోతాయని అన్నారు. ఆయన కుటుంబసభ్యులకు, స్నేహితులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని చెప్పారు.
Krishna
Tollywood
Narendra Modi
BJP
Rahul Gandhi
Congress

More Telugu News